KTR tweet on the news of the arrest

అరెస్ట్‌ వార్తలపై కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్‌: తనపై నమోదైన కేసులపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు గుడ్ లక్ చిట్టినాయుడు అంటూ కేటీఆర్‌ చురకలు అంటించారు. శునకానందం పొందాలనుకుంటే.. నీ ఖర్మ అంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్‌ హెచ్చరించారు. 30 సార్లు ఢిల్లీకి పోయినా పైసలు తేలేదు కానీ, 3 కేసులు పెట్టావంటూ ట్వీట్ చేశారు. . బీజేపీతో కాళ్ళ బేరాలు, జైపూర్‌లో అదానితో డిన్నర్ రిజల్ట్ ఇదేనంటూ సెటైర్లు పేల్చారు. గుడ్‌లక్‌ చిట్టినాయుడు అండ్‌ కో అంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. లీగల్‌గానే నిన్ను ఎదుర్కుంటానంటూ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు.

ప్రభుత్వ పాలనా లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రజల ముందు పెడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఎలాంటి త ప్పూ లేకున్నా నిందవేసేందుకు ఉత్సాహ పడుతున్నది. ముఖ్యంగా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా, ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం ఈ-రేస్‌ను వాడుకుంటున్నది. తాజాగా ఈ-రేస్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇ చ్చారని ప్రభుత్వం తెలిపింది.

కాగా, కేటీఆర్ E-ఫార్ములా రేసు పై విచారణకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ- కారు రేస్ అంశంలో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆమోదం తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. E-ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌ ను అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda. Thе fоrmеr sheffield unіtеd and greece defender george bаldосk hаѕ died at thе аgе оf 31. Latest sport news.