నేటి కాలంలో తల్లిదండ్రులు చాలా మందికి తమ పనులలో అలసిపోయి ఉంటారు. వారు పని, కెరీర్, లేదా సోషల్ మీడియా వంటి విషయాల్లో ఎక్కువ సమయం గడిపే సమయంలో, వారి పిల్లలు అనేక సందర్భాల్లో అవగాహన లేకుండా పోతారు. ఫోన్లు, కంప్యూటర్లతో సమయం గడపడం వల్ల పిల్లలతో సన్నిహిత సంబంధాలు తగ్గిపోతాయి.అందువల్ల, పిల్లలు తమ తల్లిదండ్రుల అనుభవాల గురించి తెలుసుకోలేకపోతారు.
పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్నప్పుడు, వారు సమయం కేటాయించకపోవడం పిల్లలకు బాధకరంగా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా అడిగినపుడు, వారి మాటలను శ్రద్ధగా వినకుండా ఇప్పుడు చేయలేను అని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో, పిల్లలకు తమ మాటలు మరియు అభిప్రాయాలు గౌరవించబడటం లేదని అనిపించవచ్చు. దీని వల్ల వారిలో నిరుత్సాహం మరియు అసంతృప్తి ఏర్పడుతుంది.
అంతేకాకుండా, చాలా తల్లిదండ్రులు ఎక్కువ కంట్రోల్ చేయాలని చూస్తారు. వాళ్ళ పిల్లలు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పడం, అతి క్రమశిక్షణతో వారి స్వతంత్రతను కుదించగలదు. ఇది పిల్లల భావోద్వేగాలను, వారి అభిప్రాయాలను అణచివేయడానికి కారణమవుతుంది. క్రమశిక్షణ అవసరం కానీ, అది ఎప్పుడు ఏ స్థాయిలో వుండాలి అనే దానిపై ఒక సమతుల్యత ఉండాలి.ఇలా, పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడేంత వరకు, వారిని గౌరవించడం, వారితో మంచి సంబంధం పెట్టుకోవడం చాలా ముఖ్యం. పిల్లలతో సరదాగా మాట్లాడటం, వారికీ సమయం కేటాయించడం, వారి అభిప్రాయాలను వినడం వారి మానసిక ఆరోగ్యం కోసం చాలా అవసరం. పిల్లల పెరుగుదలకూ ఇది మంచి పర్యావరణాన్ని సృష్టిస్తుంది.