GoldNov

పసిడి దిగుమతుల ఆల్ టైమ్ రికార్డ్

భారత లో పసిడి దిగుమతులు నవంబర్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నవంబర్ లో 14.8 బిలియన్ డాలర్ల పసిడి దిగుమతులు నమోదు కావడం గమనార్హం. కానీ అదే సమయంలో వాణిజ్య ఎగుమతులు తగ్గుముఖం పట్టడం ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తోంది. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు 4.85 శాతం తగ్గాయి. 2023 నవంబర్‌లో ఎగుమతులు 33.75 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2024 నవంబర్‌లో 32.11 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దిగుమతులు మాత్రం గణనీయంగా పెరిగాయి. గత ఏడాది నవంబర్ నెలలో 55.06 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ నవంబర్ నెలలో 69.95 బిలియన్ డాలర్లకు చేరుకుని 27 శాతం వృద్ధి చెందాయి.

ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్య లోటును తీవ్రంగా పెంచింది. వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 2.17 శాతం వృద్ధి చెంది 284.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతులపై నియంత్రణ చర్యలు తీసుకోవడం అవసరమని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.

పసిడి దిగుమతుల వృద్ధి దేశవ్యాప్తంగా వినియోగంలో పెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, వాణిజ్య లోటు పెరగడం ఆర్థిక రంగంలో ప్రధాన సవాల్‌గా మారింది. దిగుమతులను తగ్గించడానికి సర్కారు ప్రత్యేక పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kepala bp batam muhammad rudi hadiri rsbp batam awards 2024. Valley of dry bones. Latest sport news.