ap tourism

ఈ ఆలయాన్ని దర్శించడం ఎంతో అదృష్టం!

కోట సత్తెమ్మ.కోరికలు తీర్చే తల్లి, భక్తులకు ఆశీస్సులు అందించే చల్లని అమ్మ. ఈ తల్లి దర్శనం ఎంతో పవిత్రమైంది అని పెద్దలు చెబుతుంటారు.అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలనుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తుంటారు. తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు సమీపంలో ఉన్న కోట సత్తెమ్మ ఆలయం భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. కోట సత్తెమ్మ అమ్మవారు 10 అడుగుల ఎత్తుతో శంఖ, చక్రాలు, గదలను ధరించి అభయముద్రలో భక్తులకు దర్శనమిస్తారు.నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెంలో విరాజిల్లే ఈ అమ్మవారి ఆలయానికి చుట్టుపక్కల గ్రామాలనుంచి కాకుండా దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.నిడదవోలు పట్టణాన్ని ఒకప్పుడు రుద్రమదేవి భర్త వీరభద్ర చాళుక్యుడు పాలించేవాడు.ఆయన ఈ ప్రాంతాన్ని కోటగా రూపొందించి అనేక యుద్ధాలు చేసినట్టు చరిత్ర చెబుతోంది.

అయితే, కాలక్రమేణా ఆ కోట శిథిలమైపోయి అమ్మవారి విగ్రహం కనబడకుండా పోయిందట.తర్వాత, తిమ్మరాజుపాలేనికి చెందిన ఓ భక్తుడి పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది.అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని పూజించడం ప్రారంభించారు.కొన్నాళ్లకు అమ్మవారు ఆ భక్తుడి కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించారని చెబుతారు. దాంతో ఆ భక్తుడు తన పొలంలో కొంత భాగాన్ని దానం చేసి ఆలయ నిర్మాణం చేపట్టాడు. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉండి పచ్చని కొబ్బరి చెట్ల మధ్య విరాజిల్లుతోంది. స్థానికులు కోట సత్తెమ్మపై అపారమైన భక్తితో తమ పిల్లలకు ఆమె పేర్లు పెట్టడం విశేషం.కొందరు “సత్యం,”“సత్యనారాయణ” అనే పేర్లను కూడా ఈ అమ్మవారికి నివాళిగా ఇస్తారు. ఆలయానికి సమీపంలో నివసించే ముస్లింలు కూడా అమ్మవారిని తమ కుటుంబ సభ్యురాలిగా భావించి ఆమెకు చీరలు సమర్పిస్తారు. ఇది భక్తి, మత సహనానికి నిదర్శనంగా నిలుస్తోంది.అమ్మవారికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శరన్నవరాత్రులు, మార్గశిర మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పిల్లల కోసం భక్తులు సంతాన వృక్షాన్ని పూజించి మొక్కులు వేస్తారు.తులాభారంతో మొక్కులు తీర్చుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Ground incursion in the israel hamas war. Latest sport news.