తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాడు శాసనమండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు. ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్‌సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
పదేళ్లు పాలించిన కెసిఆర్ యువతకు పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్యం నిరుద్యోగం నుంచి యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నాము అన్నారు. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత పదేళ్లలో ఒక్క డీఎస్‌సీ కూడా నిర్వహించలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ నిర్వహించడంతో పాటు నియామక పత్రాలు అందజేశామన్నారు. ఉద్యోగార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని భట్టి విక్రమార్క తెలిపారు. తమ గవర్నమెంట్ ఎవరికి అన్యాయం చేయదని, అందరికి అవకాశాలు కల్పిస్తామన్నారు.