అప్పుడే ఇంటర్నేషనల్ డిస్కషన్స్ ఆ.!

ssmb 29

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై అఫీషియల్ అప్‌డేట్స్ లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సెట్స్‌పైకి వెళ్లకముందే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ఉత్సుకత మరింత పెరుగుతోంది. గుంటూరు కారం చిత్రాన్ని పూర్తి చేసిన మహేష్ బాబు కొద్దిసేపు బ్రేక్ తీసుకొని వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, గ్లోబల్ మూవీగా ప్లాన్ చేయబడింది. మహేష్ ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. ట్రిపులార్ విడుదల అనంతరం చాలాకాలం సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న రాజమౌళి, ఇప్పుడు పూర్తిగా మహేష్ మూవీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది.

మరోవైపు ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవలే లొకేషన్లను ఫైనల్ చేసిన జక్కన్న టీమ్, ప్రీ విజువలైజేషన్ పనిలో నిమగ్నమైంది.ఈ సినిమా అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండటంతో, ప్రతి సీన్‌ను ముందే ప్రాక్టీస్ చేయడం కోసం లీడ్ ఆర్టిస్టులతో వర్క్‌షాప్ నిర్వహించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.పుష్ప 2 లాంటి సినిమాల మార్కెట్ ఫిగర్స్‌ను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న అన్ని పనులు పూర్తయ్యాక 2025 ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.మహేష్ ఈ సినిమాలో ఇప్పటివరకు ట్రై చేయని ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సారి కాస్టింగ్ నేషనల్ లెవల్‌ను మాత్రమే కాదు, గ్లోబల్ లెవల్‌ను కూడా టార్గెట్ చేస్తోంది జక్కన్న టీమ్. ఇండియన్ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన రాజమౌళి, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌తో కలిసి పని చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Taiwan’s scenic tourist destination faces earthquake risks from active faults. Latest sport news.