తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ నెయ్యి ఏఆర్ డెయిరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించారని, లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించారని, అనంతరం ఆ నెయ్యిని ఏఆర్ డెయిరీ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని సిట్ అధికారులు గుర్తించారు. ఆ ట్యాంకర్లు వెళ్లిన మార్గాలు, టోల్గేట్ వద్ద ఆగిన సమయాలు సహా అన్ని ఆధారాలను పక్కాగా సేకరించారు. జగన్ పాలనలో టీటీడీలో అవినీతి పనులు జరిగాయని టీడీపీ ఆరోపణ. ఈ దిశగా ఇక్కడి అవినీతి పై విచారణ జరుగుతుంది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, దీనిపై విచారణకు సుప్రీం ఆదేశించండం జరిగింది. ఆ వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు వివరించారు. అంతకుముందు వారు తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రసాదం తయారీకి సేకరిస్తున్న నెయ్యి, శనగపప్పు తదితర సరుకులతోపాటు వాటి నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, సరుకుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు.