రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం?

Revanth govt key decision on rythu bharosa?

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు షాకింగ్ న్యూస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సహా కీలక మంత్రులు సంక్రాంతి నుంచి రైతు భరోసా అందిస్తామని చెబుతున్నారు. గతంలో భూమి ఉన్న రైతులు అందరికీ కేసీఆర్ రైతు భరోసా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు కటాఫ్ పెట్టనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేసింది. 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా లిమిట్ పెడతారని టాక్ వినిపిస్తోంది.

ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులకు సైతం రైతుభరోసా ఇవ్వకూడదని కేబినెట్ సబ్ కమిటీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రైతు భరోసాపై కమిటీ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీ, కేబినెట్ భేటీలో చర్చించి రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందిస్తారని సమాచారం. కాగా, రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ సీజన్‌కు ఒకసారి ఎకరాకు రూ.7500 ఇవ్వనున్నారు.

ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. రైతు భరోసా పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం లక్ష్యం చిన్న, సన్నకారు రైతుల పరిస్థితిని మెరుగుపరచడమే. ఎకరాల పరిమితిని నిర్దేశించడం ద్వారా ఈ పథకం తగినవారికి మాత్రమే అందుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు వాస్తవంలో ఏ విధంగా అమలవుతాయో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Missing sebastian rogers : police say ‘inaccurate’ info has caused ‘distraction’ – mjm news. Latest sport news.