ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇసా గుహా,భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలపై ఆఖరికి క్షమాపణలు చెప్పారు.గబ్బాలో మూడో రోజు టెస్టు ప్రారంభం కాగానే, ఆమె తన వ్యాఖ్యానంలో “ప్రైమేట్” అనే పదాన్ని ఉపయోగించారు.ఈ పదానికి “కోతి” అనే అర్థం కూడా ఉండటంతో వివాదం చెలరేగింది. ఇసా గుహా బుమ్రాపై వ్యాఖ్యానిస్తూ తన వ్యాఖ్య దారుణంగా తీసుకున్నందుకు క్షమాపణలు తెలిపారు.ఆమె మాట్లాడుతూ,వ్యాఖ్యాన సమయంలో, నేను అనేక అర్థాలు కలిగిన ఒక పదాన్ని ఉపయోగించాను.అది ఎవరికైనా నొప్పిచేసి ఉంటే, నేను హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. నేను భారత క్రికెటర్ల ప్రతిభను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. కానీ ఈ సందర్భంలో తప్పు చేశానని అంగీకరిస్తున్నాను,” అంటూ వివరణ ఇచ్చారు.ఈ వివాదం గబ్బా టెస్టు రెండో రోజు ప్రారంభమైంది.
బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో, ఇసా గుహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.అభిమానులు ఆగ్రహంతో ఆమెపై విమర్శలు గుప్పించడంతో, ఆమె స్పందించక తప్పలేదు. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఆమె క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం కొంతమేరకు చల్లబడింది.ఇసా గుహా మాట్లాడుతూ, “నాకు భారత క్రికెట్ గురించి ఎంతో గౌరవం ఉంది. నేను బుమ్రాపై చేసిన వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకోవడాన్ని పశ్చాత్తాపంతో స్వీకరిస్తున్నాను. బుమ్రా విజయాలను నేను ఎప్పుడూ ప్రశంసిస్తాను. ఇది కేవలం నా అనవసరమైన పదప్రయోగం కారణంగా జరిగింది,” అని స్పష్టం చేశారు. ఇసా గుహా ఇంగ్లాండ్ తరఫున అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో ఒకరు. కేవలం 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ హస్త ఫాస్ట్ బౌలర్, 8 టెస్టుల్లో 29 వికెట్లు, 83 వన్డేల్లో 101 వికెట్లు సాధించారు. టీ20ల్లోనూ తన ప్రతిభను చూపిన ఆమె, 18 వికెట్లు తీశారు.