PV Sindhu engagement

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బ్యాడ్మింటన్ క్వీన్..

హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.ఆమె ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్త సాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.ఈ జంట నిశ్చితార్థం ఇటీవల ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో సింధు, దత్త సాయి ఉంగరాలు మార్చుకుని తమ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తూ ఆనందంగా ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.”ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు, తిరిగి ప్రేమించగలగడం గొప్పది” అని పీవీ సింధు తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలకే క్యాప్షన్‌గా రాశారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పీవీ సింధు వివాహ వేడుక డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రే స్వయంగా ధృవీకరించారు.రాజస్థాన్‌లో జరిగే ఈ వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జాడిగా జరుగుతుందని సమాచారం.పెళ్లి తర్వాత, డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. సింధు కాబోయే భర్త వెంకట దత్త సాయి హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్. అతను పొసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ జంట కుటుంబాలకు చాలా కాలం నుంచే స్నేహం ఉంది. ఇప్పుడు ఈ వివాహంతో ఆ సంబంధం మరింత బలపడనుంది.పీవీ సింధు జనవరి నుంచి వరుస టోర్నీల్లో పాల్గొననున్నారు. ఇందువల్లే ఆమె తండ్రి పెళ్లి వేడుకలను డిసెంబర్ 22న ఫిక్స్ చేశారు. ఈ నెల 20 నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని కుటుంబ వర్గాలు వెల్లడించాయి.క్రీడా రంగంలో ఎన్నో గెలుపులు సాధించిన పీవీ సింధు, ఇప్పుడు జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న క్రీడా మరియు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు కూడా తమ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా పీవీ సింధు, దత్త సాయికి జీవితంలో కొత్త ఆరంభానికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dprd batam gelar paripurna bahas ranperda angkutan massal dan perubahan perda pendidikan. Ground incursion in the israel hamas war. Latest sport news.