మాజీ కేంద్ర మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డారు. నెల రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. నవంబర్ 13వ తేదీన ఎంఐఓటీ హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో .. ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు తిరుమగన్ ఇవెర మృతిచెందిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు.
ఈవీ రామస్వామి బంధువే ఇళంగోవన్
ద్రావిడ ఉద్యమ నేత పెరియార్ ఈవీ రామస్వామి సోదరుడి మనవడే ఇళంగోవన్. చిన్న వయసులోనే ఇళంగోవన్ రాజకీయ ఎంట్రీ చేశారు. 1984లో ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిగా చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు.