‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత

farmers protest

కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు శనివారం పునఃప్రారంభించిన ‘ఛలో ఢిల్లీ’ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాలాకాలంగా రైతులు తమ డిమాండ్స్ కోసం ఉద్యమం చేస్తున్నారు. శనివారం మరోసారి రైతులు ఉద్యమం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే రైతుల పాదయాత్రను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. హర్యానా-పంజాబ్ సరిహద్దులో రైతులను చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఈ పాదయాత్రలో 101 మంది రైతులు పాల్గొనగా దాదాపు 10 మంది రైతులు గాయపడ్డారు. దీంతో మరోసారి ‘ఛలో ఢిల్లీ’ యాత్రను నిలిపివేస్తూ రైతులు నిర్ణయించుకున్నారు.
బజరంగ్ పునియా శంభు విమర్శలు
కాగా, కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్ బజరంగ్ పునియా శంభు సరిహద్దులో రైతులను కలిసి మాట్లాడారు. రైతులను అడ్డుకోవడం లేదని చెబుతూనే బాష్పవాయువు ప్రయోగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. శంభు సరిహద్దును పాకిస్థాన్ సరిహద్దులా వ్యవహరిస్తున్నారని, రైతు నేతలు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.

డిసెంబరు 6న రైతులు ‘ఛలో ఢిల్లీ’ నిరసన ర్యాలీ మొదలుపెట్టారు. అయితే శంభు సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్నారు. డిసెంబరు 6, 8 తేదీలలో కూడా రైతులను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఇవాళ మరోసారి ప్రయత్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іt іѕ always a lіttlе lаtеr thаn you think. Function without sofie grabol ?. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its.