నర్సాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై గల నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కును రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ ల మంత్రి కొండా సురేఖ సందర్శించారు నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్బన్ పార్క్ అంతా పరిశీలించి వాచ్ టవర్ ను ఎక్కి పరిసరాలను పరిశీలించారు. అర్బన్ పార్క్ లో మంత్రి కొండా సురేఖ మొక్కను నాటారు.
ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ మంత్రి కొండా సురేఖ తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ లోని అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎకో టూరిజం ఏర్పాటు చేస్తామని అన్నారు అర్బన్ పార్కులు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరానికి అతి సమీపంలోనున్న నర్సాపూర్ అడవులు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ఈ అర్బన్ పార్క్ లో పచ్చని చెట్లు వాచ్ టవర్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేయడంతో పర్యాటకులు సందర్శిస్తూ మంచి వాతావరణం ఆస్వాదిస్తున్నారని ఇది ఎంతో అభినంద నియమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అటవీశాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు