గ్రూప్ 2 పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెల్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు.
ఏర్పాట్లు పూర్తి
గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిందని చెప్పారు. ఇప్పటికే నాలుగుసార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని అన్నారు. 5,51,847 మంది విద్యార్థులు గ్రూప్ 2 కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. 58 రీజనల్ కో అర్దినేటర్లను నియమించామన్నారు. పరీక్ష కోసం 65వేల మంది సిబ్బంది వివిధ పనుల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. 75 శాతం అభ్యర్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. 783 ఉద్యోగాలకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి లోపు గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ ఇస్తామని అన్నారు.