డార్లింగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా.!

spirit movie

అర్జున్ రెడ్డి మరియు యానిమల్ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌తో తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ స్పిరిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా గురించి ఒక్క అప్‌డేట్ మాత్రమే రాగా, ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న హైప్‌ మరింతగా పెరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాను విభిన్న జానర్లలో చేస్తూ, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ది రాజా డీలక్స్ మరియు ఫౌజీ చిత్రాల్లో పాల్గొంటున్న ప్రభాస్, ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. స్పిరిట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఒకే ఒక్క అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సినిమాలో ప్రభాస్ రూత్‌లెస్‌ కాప్‌గా కనిపించబోతున్నారు. యూనిఫార్మ్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటారనే ఆసక్తి అభిమానుల్లో అధికంగా ఉంది. ఈ అప్‌డేట్‌తోనే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు పీక్స్‌కి చేరాయి.

ఈ సినిమా గురించి వస్తున్న మరో ఆసక్తికర అప్‌డేట్ ఏమిటంటే, ట్రైన్ టు బుసాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కొరియన్ స్టార్ మా డాంగ్-సియోక్ ఇందులో ముఖ్య పాత్రలో నటించనున్నారన్న వార్త. మరింతగా, ప్రభాస్‌తో కలిసి డాంగ్-సియోక్‌ నటించే యాక్షన్ సీన్స్‌ను సందీప్ అత్యంత స్టైలిష్‌గా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ అప్‌డేట్‌తో స్పిరిట్ కోసం ప్రభాస్ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభాస్ మరియు డాంగ్-సియోక్ మధ్య ఉండబోయే యాక్షన్ బ్లాక్స్‌ ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ట్రెండ్ అవుతోంది. స్పిరిట్ గ్లోబల్ కథాంశంతో రూపొందనుందని తెలుస్తోంది. డాంగ్-సియోక్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌గా కనిపించనుండగా, ప్రభాస్ అతన్ని ఎదుర్కొనే భారతీయ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. 禁!.