‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. రిమాండ్ ఖైదీలకు కేటాయించే ప్రత్యేక గదిలోనే అల్లు అర్జున్‌ను ఉంచుతారు. సినీ నటుడు కావడంతో సాధారణ ఖైదీలతో కాకుండా, భద్రతను పరిగణనలోకి తీసుకుని ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది. నేరస్తుల నుంచి దూరంగా ఉండేందుకు రిమాండ్ ఖైదీల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు.
జైలులో అందరికి అందించే సాధారణ భోజనం స్థానంలో అల్లు అర్జున్‌కు ఇంటి భోజనాన్ని అనుమతించే అవకాశముంది. ప్రముఖ వ్యక్తులు రిమాండ్ ఖైదీల్లో ఉంటే ఇలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం సాధారణమని జైలు అధికారుల వర్గాలు తెలిపాయి. అల్లు అర్జున్ పాపులర్ నటుడు కావడంతో జైలు చుట్టూ కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అల్లు అర్జున్‌కు ప్రత్యేక గదిలో వసతులు కల్పిస్తుండటంతో జైలు సిబ్బంది ఆయనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు. జైల్లో ఉన్న సమయంలో భద్రతకు విపరీత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అల్లు అర్జున్‌కు అవసరమైన మౌలిక వసతులను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 27 వరకు అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండనున్నారు.