అల్లుఅర్జున్ అరెస్ట్ పై ప్రముఖుల స్పందన

revanth reddy 292107742 16x9 0

శుక్రవారం ఉదయం జరిగిన సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పార్లమెంట్ మీడియా లాబీ వద్ద మాట్లాడుతూ… చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తన జోక్యం ఉండదని అన్నారు.
బండి సంజయ్ స్పందన
అల్లు అర్జున్ అరెస్ట్ పై కేంద్ర మంత్రి తీవ్ర విచారం వెలుబుచ్చారు. ఓ నేరస్థుడ్ని అరెస్ట్ చేసినట్లు చేస్తారా అని బండి ఆగ్రహం వ్యక్తం చేసారు. తన సినిమా ద్వారా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అల్లును ఈ విధంగా అగౌవరపరచడం సరికాదని బండి అన్నారు. భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం పెద్ద తప్పు అని బండి విమర్శించారు.
హరీష్ రావు విమర్శ
అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే.
మరోవైపు, గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఆయనను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్దకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Southeast missouri provost tapped to become indiana state’s next president. Latest sport news.