సిద్ధార్థ్ గురించి ఇటీవలి కాలంలో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ నటుడి సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపించడం తగ్గిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే.ఈ పరిస్థితికి ఆయన నోటిదురుసే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.అయితే, నోటిదురుసు పక్కనబెడితే, మంచి కథా చిత్రాలను అందిస్తున్నాడా? అంటే,అదీ గట్టిగా చెప్పలేని విషయం.ఇటీవల, సిద్ధార్థ్ ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచాడు. అది మరెవరి గురించి కాదు, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 గురించి.పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్‌ను చులకనగా చూసిన సిద్ధార్థ్, “ఫ్యాన్స్ ప్రేమతో వస్తే.. జేసీబీ పనులు చేసినా జనాలు వస్తారు. వాళ్లు బీరు, బిర్యానీ బ్యాచ్‌లా ఉంటారు” అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో బన్నీ అభిమానులను తీవ్రంగా కోపగొట్టాడు. తర్వాత ఆయన పరోక్షంగా తన వ్యాఖ్యలను సరిదిద్దేందుకు, పుష్ప 2 సక్సెస్‌ను ప్రశంసిస్తూ,“సినిమా హిట్టవ్వడం మంచి విషయం. థియేటర్లకు కూడా ఇలాంటి జనం వస్తే, మొత్తం ఇండస్ట్రీ బాగుంటుంది”అని వ్యాఖ్యానించాడు.
కానీ అప్పటికే పరిస్థితి తీవ్రంగా దెబ్బత ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతఈ పరిణామాల నేపథ్యంలో, సిద్ధార్థ్ తాజా చిత్రం మిస్ యూ పరిస్థితి మరింత దిగజారింది. ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులు, ఈ సినిమాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది.మిస్ యూ పై సోషల్ మీడియాలో గానీ,థియేటర్లలో గానీ పెద్దగా చర్చలు జరగడం లేదు. మరి కొందరు ట్విట్టర్‌లో, అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ట్రోలింగ్‌కు గురవుతున్న నటుడు మిస్ యూ మూవీకి ఉన్న తక్కువ చర్చ కారణంగా, సిద్ధార్థ్ అనవసరమైన ట్రోలింగ్‌కు గురవుతున్నారు. “జేసీబీల్లో థియేటర్లకు వెళ్తున్నారు” వంటి వ్యంగ్య వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో, ఆయన తన మాటలను మరింత జాగ్రత్తగా వాడితే మంచిది అనిపిస్తోంది.