జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ ఆమోదం

Vote In India

గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ జమిలి ఎన్నికలపైనే. ఎట్టి పరిస్థిలోను జమిలి ఎన్నికలను జరిపితీరుతాం అని బీజేపీ పేరొనట్లుగానే జమిలి ఎన్నికల(వన్ నేషన్ – వన్ ఎలెక్షన్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలికి ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశంలో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండటం… దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందని ఎన్డీయే ప్రభుత్వం తొలి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని... ఆ తరువాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది.అయితే ఈ నిర్ణయాన్ని ఇండియా కూటమి వ్వతిరేకిస్తుంది. ఈ బిల్లుని ఆమోదించకూడదని కూటమి ఆలోచనగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad archives | swiftsportx. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. The philippine coast guard said on dec.