Headlines
RRR Jr NTR and Ram Charan

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై డాక్యుమెంటరీ..

దర్శకధీరుడు రాజమౌళి ‘RRR’ వెనుక కథను వివరించే డాక్యుమెంటరీ రాబోతోంది పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం ‘RRR’ గురించి కొత్త చర్చ మొదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసులను గెలుచుకుంది.ఈ చిత్రంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా ఈ సినిమాను ప్రశంసించగా, విదేశాల్లోనూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమా వెనుక ఉన్న కష్టం, సాంకేతికత, అంతర్గత కథల గురించి తెలిపే డాక్యుమెంటరీ రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెలలో విడుదలకానున్న ‘RRR: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ డాక్యుమెంటరీ పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, అందులో రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “ప్రపంచం కీర్తిని చూసింది, ఇప్పుడు దాని వెనుక కథను చూస్తుంది” అనే క్యాప్షన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ డాక్యుమెంటరీలో RRR కథ ఎలా పుట్టిందో, కోవిడ్ సమయంలో ఎదురైన ఇబ్బందులు, షూటింగ్ తిరిగి ప్రారంభం, వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, కాస్ట్యూమ్స్, ఇంకా అనేక అంశాలపై చిత్ర బృందం వివరించనుంది.ఆస్కార్ ప్రచారం సమయంలో జరిగిన అనుభవాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమా పొందిన గుర్తింపు, ఫ్యాన్స్ ప్రేమ, వీటన్నిటిని ఈ డాక్యుమెంటరీలో ప్రతిబింబించనున్నారు.ప్రపంచవ్యాప్తంగా ‘RRR’ సినీ చరిత్రలో కొత్త ఒరవడి సృష్టించగా, ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

White sip through lids for225ml (8oz) cups1000 per case quantity. The report provided information on recent cyber attacks launched on hundreds of usa and foreign organizations. I was really glad when i realised that he has started his own company now, easy budget safaris ltd.