సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు: అభిమానులు, సెలబ్రిటీల నుంచి ప్రేమ వెల్లువ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజనీకాంత్ సినీ ప్రయాణం, వ్యక్తిగత విశేషాలు ఫ్యాన్స్ నెట్టింట్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బస్ కండక్టర్‌గా సాధారణ జీవితాన్ని గడుపుతూ నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టి, గ్లోబల్ సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ఎన్నో అవమానాలు, అవరోధాలు ఎదుర్కొంటూ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు.
తన ప్రత్యేకమైన స్టైల్, మేనరిజం, అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సాధించాయి. 74 ఏళ్ల వయసులోనూ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు.ప్రస్తుతం రజనీకాంత్ తలైవర్ 170 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్ స్టైల్ ఏషియా నివేదిక ప్రకారం, రజనీకాంత్ నికర విలువ దాదాపు ₹430 కోట్లుగా అంచనా వేయబడింది. ఒక్కో సినిమాకు ₹100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జైలర్ విజయం తర్వాత ఆయన తన పారితోషికాన్ని మరింత పెంచారని సమాచారం.
చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో రజనీకాంత్‌కు విలాసవంతమైన బంగ్లా ఉంది, దీని విలువ సుమారు ₹35 కోట్లు. అంతేకాక, చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం ఆయన సొంతమైంది, దీని ధర ₹20 కోట్లు.రజనీకాంత్ కార్ల కలెక్షన్ విషయంలో కూడా ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగి ఉన్నారు. రెండు రోల్స్ రాయిస్ కార్లు, జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల కార్లతో ఆయన గ్యారేజ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.