రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఘాటైన విమర్శలు

KTR key comments on Amrit tenders

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ పై ఘాటైన విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో అర్ధసత్యాలు, అవాస్తవాల‌తో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. “రేవంత్ గారు, మీరు ఇంతవరకు చెప్పిన మాటలు అబద్ధమే, మీ చేతలు కూడా అబద్ధమే. మీరు కేవలం అవాస్తవాలు పుట్టించడంలో మాత్రమే నిపుణులు,” అని KTR పేర్కొన్నారు.

‘రేవంత్.. మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?
మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం..
అర్దసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు!
కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా?
50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం?
RBI Handbook of India States బట్టి తెలంగాణ అప్పు ఎంత వుందో తేటతెల్లమవుతుంది!
ఢిల్లీకి మూటలు మూసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు!
Lies, more lies and nothing but LIES!’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని, ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను.. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్లు తెరవాలని సూచించారు. వర్షం కురుస్తుందో లేదో, సాగునీరు, కరంటు, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో.. లేదో? అని తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలన్నారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దన్నారు. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To help you to predict better. Hаrrу kаnе іѕ mоdеrn england’s dаd : but is іt tіmе fоr hіm to соnѕіdеr stepping аѕіdе ? | ap news. Russians stage a rare protest after a dam bursts and homes flood near the kazakh border.