మంచు ఫ్యామిలీ ఫైట్… మంచు లక్ష్మీ ఆసక్తికర పోస్ట్

manchu laxmi post

మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న ఆస్తి గొడవలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేయడం కొత్త చర్చకు దారి తీసింది. “ఈ లోకంలో ఏదీ నీది కానప్పుడు, ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు” అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్టు ఫ్యామిలీ గొడవలకే సంబంధించినదా? అనే అంశంపై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు.

గత రెండు రోజులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వచ్చిన విభేదాలు రెండుతెలుగు రాష్ట్రాల్లో చర్చ కు దారితీసాయి. ఈ గొడవల కారణంగా మంచు కుటుంబం ప్రజల దృష్టిలో నిలిచింది. మంచు మనోజ్ గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, వాటి నేపథ్యంలో కుటుంబం కలహాలు మరింత పెరగడం జరిగాయి. ఈ క్రమంలో మంచు లక్ష్మీ చేసిన పోస్టు ఎవరిని ఉద్దేశించి ఉందో చెప్పకపోయినప్పటికీ, ఇది ఫ్యామిలీ గొడవలపైనే అని చాలామంది నమ్ముతున్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ, ఫ్యామిలీ సమస్యలు బయటకు రావడం మంచిదేనా అన్న దానిపై చర్చిస్తున్నారు.

మంచు లక్ష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తరచుగా వ్యక్తిగత అభిప్రాయాలు, సందేశాలు షేర్ చేస్తుంటారు. కానీ ఈసారి చేసిన పోస్టు మాత్రం కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఉండవచ్చునన్న అనుమానాలకు తావిస్తోంది. మంచు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు ఎలా పరిష్కారమవుతాయో అన్న దానిపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం నెలకొన్న కలహాలు పరిశ్రమలోనే కాదు, అభిమానుల మధ్య కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. (ap) — the families of four americans charged in.