బోరుబావిలో పడ్డ బాలుడు మృతి

Five year old Aryan

రాజస్థాన్ , డిసెంబర్ 12,బోరుబావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు రెండు రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. విషాదకర సంఘటనగా మిగిలిపోయిన బాలుడి ఉదంతం రాజస్థాన్ లో జరిగింది. దీనికి సంబందించి పూర్తి వివరాలు..గత రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ బాలుడి ప్రాణాలను కాపాడేందుకు అధికారులు విశ్వాప్రయత్నాలు చేసారు. ప్రమాదవశాత్తు 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడుని 56 గంటల తర్వాత బయటకు తీసినప్పటికీ, ప్రాణాలు మాత్రం దక్కలేదు. రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిందీ ఘటన.

మూడు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. గంట తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. పైపు ద్వారా ఆక్సిజన్‌ను లోపలికి పంపారు. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు లోపలికి కెమెరాను కూడా పంపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌తోపాటు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. బోరుబావిలో చిక్కుకుపోయిన బాలుడు ఆర్యన్‌ను రక్షించేందుకు రెండ్రోజులపాటు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించినప్పటికీ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కలేదు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని తాడు సాయంతో బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

నీటి కోసం బోరుబావి తీసినపుడు అందులో నీరు రాకపోతే వెంటనే వాటిని పూడ్చివేయాలని కోర్టులు ఎన్నిసార్లు ఆజ్ఞాపించిన ప్రజల్లో చేంజ్ రావడం లేదు. తాజాగా రాజస్థాన్ లోని ఆర్యన్ మరణించాడు.ఆర్యన్ ను రక్షించేందుకు అధికారులు బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వారు. అయితే, డ్రిల్లింగ్ మెషీన్ పాడవడం, 160 అడుగుల లోతులో నీరు పడే అవకాశం ఉండడంతో బాలుడిని రక్షించేందుకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. ఇంకా తవ్వుకుంటూ పోతే బాలుడిపై మట్టిపెళ్లలు పడే అవకాశం ఉండడంతో చివరికి బాలుడి చుట్టూ తాడు కట్టి జాగ్రత్తగా బయటకు లాగారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఈసంఘటతోనైనా మనము మార్పు చెందుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. Read more about facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Missing sebastian rogers : police say ‘inaccurate’ info has caused ‘distraction’ – mjm news.