కోతలు, కూతలు కాదు చేతలు కావాలి: కేటీఆర్‌

ktr comments on congress government

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్న ప్రకటనలపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని, ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను.. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్లు తెరవాలని సూచించారు. వర్షం కురుస్తుందో లేదో, సాగునీరు, కరంటు, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో.. లేదో? అని తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలన్నారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దన్నారు. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దన్నారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పారని, అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు వెతుకుతున్నారని కేటీఆర్‌ కాంగ్రెస్‌ పై మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Cambodia bans musical horns on vehicles to curb dangerous street dancing.