దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో వేడుకగా ప్రతిష్టాత్మరంగా నిర్వహించే ఏడుగంగమ్మల జాతరను ఈ ఏదాది భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించారు.జాతర నిర్వహణలో దేవస్తానం కీలకంగా వ్యవహారించింది.ఈ ఏడాది శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ఆదేశాలతో ఆలయ ఇఓ టి. బాపిరెడ్డి చక్కటి ఏర్పాట్లు నిర్వహించారు.మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముత్యాలమ్మగుడి నుండి బయలుదేరిన ఏడు గంగమ్మలు స్థావరాలకు బుధవారం ఉదయం 8గంటలకు ముందే చేరాయి.
గతంలో స్థావరాలు చేరే సమయానికి ఉదయం 9గంటలయ్యేది.భక్తి శ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.జాతరలో ఎలాంటి విఘ్నాలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. డివైయస్పి నరసింహామూర్తి, సిఐ డి.గోపిల సారధ్యంలో పోలీసులు చక్కగా బందోబస్తు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత స్థానిక ఆచార వ్యవహారాల మేరకు ఏడుగంగమ్మలు ఆలయం వద్ద పసుపు ముద్దలతో అమ్మవారి రూపాలను అలంకరించారు.అభిషేకం జరిపించారు. తరువాత గంగమ్మ కమిటీ నిర్వాహాకులు పసుపు ముద్దలను నెత్తిన పెట్టుకొని స్థావరాలకు ఏకాంతంగా భక్తుల సందడి లేకుండా చేర్చుకున్నారు. అమ్మవారి పసుపుముద్దలను ప్రతిష్టించి దీపాలు వెలిగించారు. పట్టణంలోని ముత్యాలమ్మగుడివీధిలోని తెట్టునాయికి సమీపంలోని ఏడుగoగమ్మలు నిలిచే స్థలంలో ఏడు ప్రాంతాల్లో గంగమ్మలను ఆచారం ప్రకారం నిలిపారు. ఏడు గంగమ్మల ఆలయంలో విరాట్టుకు ప్రత్యేక అలంకారాన్ని నిర్వహించారు. వాటిని ఒకే వేటులో నరికి బలిదానం చేశారు.
అనంతరం అఖండ హరతులిచ్చారు.ఈసందర్భంగా కుమ్మరులు చెందిన వారు బంకమట్టిని ముద్దలు చేసి పసుపుతో కలిపి అమ్మవారి రూపాలుగా తయారుచేశారు. ఎలా చేయాలి? అనే అంశాలకు సంబంధించి వివరించారు. వాటిని ఆయా గంగమ్మల కమిటీ నిర్వా వారులు తీసుకుని భద్రపరచారు. అమ్మవారికి ఎదురుగా అఖండదీపాన్ని వెలిగించారు. కాగా దేవస్థానం సమర్పించిన సారెను ఆలయం నుంచి అందించారు. అనంతరం వేరవలాము నాలుగుగంటల సమయంలో , మంగళవాయిద్యాలు పంబజోళ్ల మోత తప్పట్లతో గుగముల నుపసుపు ముద్దలు, ముత్యాలమ్మ గుడివీధిలో గుమ్మలు బయలుదేరే సమయంలో మొదట ప్రతి అమ్మవారి విగ్రహం వద్ద గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి అఖండ కర్పూరహారతులిచ్చారు.