మన శరీరానికి, మానసిక ఆరోగ్యం పట్ల సమతుల్యత సాధించడం చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో అధిక ఒత్తిడి మరియు ఉత్కంఠ అనేవి చాలా మందిని బాధించే ప్రధాన సమస్యలుగా మారాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలు మరియు పోషకాలతో ఈ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. జింక్, మెగ్నీషియం, డార్క్ చాక్లెట్, అవకాడో, గ్రీన్ టీ వంటి ఆహారాలు మనకు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి.
జింక్ మన శరీరంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అడ్రినల్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరచడంలో జింక్ కీలకంగా పనిచేస్తుంది. సమతుల మానసిక స్థితిని కనబరిచే విషయంలో కూడా జింక్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఈ పోషకాన్ని సరైన మోతాదులో తీసుకోవడం అవసరం. జింక్ కొరతతో ఒత్తిడి, గందరగోళం పెరిగే అవకాశం ఉంటుంది.ఇంకా, మెగ్నీషియం కూడా ఒత్తిడి తగ్గించడంలో సహాయపడే పోషకం. ఇది మన శరీరంలో శాంతి స్థితిని నిలుపులో సహాయపడుతుంది. దీనివల్ల మన మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
డార్క్ చాక్లెట్ కూడా ఒత్తిడి తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉన్న ఫ్లావనాయిడ్స్ నేచురల్ మూడ్ బూస్టర్లు. ఇవి ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, మన మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.అవకాడోలు మన మెదడు మరియు మానసిక ఆరోగ్యానికి అత్యంత మంచిది. అవకాడోలో ఉండే పోషకాలు మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తాయి.అలాగే మానసిక స్థితిని కూడా సమతుల్యంగా ఉంచుతాయి.గ్రీన్ టీ కూడా ఒత్తిడి తగ్గించేందుకు ఒక అద్భుతమైన సహజ సాధనం.దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, మన శరీరాన్ని హాయిగా ఉంచుతాయి.ఈ ఆహారాలను సరిగా తీసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు, ఆరోగ్యకరమైన మానసిక స్థితిని పొందవచ్చు.