ఒక్క‌టిగా ఎదుగుదాం.. ప్ర‌చారాన్నిరాహుల్ ద్ర‌విడ్‌తో ప్రారంభించిన శ్రీ‌రామ్ ఫైనాన్స్

Let's grow as one.. Shriram Finance launched the campaign with Rahul Dravid

హైదరాబాద్‌: శ్రీ‌రామ్ గ్రూప్ వారి ప్ర‌ధాన కంపెనీ అయిన శ్రీ‌రామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌.. భార‌త‌దేశంలో ప్ర‌ధాన ఆర్థిక సేవ‌ల ప్రొవైడ‌ర్ల‌లో ఒక‌టి. ఇది తాజాగా “మ‌న‌మంతా క‌లిసి ఎదుగుదాం” అనే స‌రికొత్త బ్రాండ్ ప్ర‌చారాన్ని ప్రారంభించింది. ప్ర‌స్తుతం చాలామంది భారతీయులు ‘అయితే, ఏమిటి?’ అనే తత్వంతో ఉంటున్నారు. ఇది వారి విజయ ప్రయాణంలో సవాళ్లను అధిగమించాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. ఈ స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకోవడం, భాగస్వామ్యాన్ని రాహుల్ ద్రావిడ్ సొంత జీవితంలోని ఒక భాగంతో ముందుకు తీసుకెళ్లడానికి ఒక సాధనంగా చిత్రీకరించడం ఈ ప్ర‌చారం లక్ష్యం.
ఇందులోని సందేశం చాలా స్ప‌ష్టంగా ఉంటుంది: “మ‌న‌మంతా కలిసి ఎగురుతున్నాం. మా కస్టమర్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా, మేము వారి శక్తిలోకి అడుగు పెట్టడానికి, వారి కలలను సాధించడానికి వారికి సహాయపడతాము.” శ్రీ‌రామ్ ఫైనాన్స్ #TogetherWeSoar | ఒక్క‌టిగా ఎదుగుదాం -https://bit.ly/tws_tl
ప్రచారం వెనుక స్టార్ పవర్..
క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. టీమ్ వర్క్, స్థితిస్థాపకతల‌ విలువలను శ్రీరామ్ ఫైనాన్స్ కూడా సూచిస్తుంది. ఆస్కార్‌ అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత కె.ఎస్.చంద్రబోస్ ఈ యాడ్ ఫిల్మ్ తెలుగు వెర్షన్ కోసం సాహిత్యాన్ని రాశారు. ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా ఈ యాడ్ ఫిల్మ్ హిందీ వెర్షన్ కు వాయిస్ ఇచ్చారు. ఈ ప్రచారంలో తమిళ వెర్షన్ కోసం ప్రముఖ గేయరచయిత మదన్ కార్కి రాసిన సాహిత్యం కూడా ఉంది.
ఒక జాతీయస్థాయి చొరవ..
సమగ్రమైన 360 డిగ్రీల మీడియా విధానంతో, “టుగెదర్, వి సోర్” ప్రచారం ప్రింట్, డిజిటల్, టెలివిజన్, సోషల్ మీడియా, ఔట్ డోర్ ప్లాట్‌ఫాంల ద్వారా, అలాగే దేశ‌మంతా ఎంపిక చేసిన థియేటర్ల ద్వారా ప్రేక్షకులను చేరుకుంటుంది. శ్రీరామ్ ఫైనాన్స్ ప్రో కబడ్డీ లీగ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పీకేఎల్ సమయంలో ప్రేక్షకులు ఈ ప్రకటనను చూస్తారు.
భాగస్వామ్య సందేశం..
ఈ ప్రచారం గురించి శ్రీరామ్ ఫైనాన్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎలిజబెత్ వెంకటరామన్ ఇలా మాట్లాడారు: “ ‘టుగెదర్, వి సోర్’ అనే ప్ర‌చారం ప్రతి భారతీయుడికి అండగా నిలబడటానికి, వారి ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడానికి మా వాగ్దానానికి ప్రతీక- అది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, వాహనాలకు ఫైనాన్సింగ్ చేయడం, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం లేదా బంగారం లేదా వ్యక్తిగత రుణాల ద్వారా నిధులను త్వరగా పొందడం మొదలైనవి. ఏడు భాషల్లో రూపొందించిన మా సృజనాత్మక విధానం దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రేక్షకులతో లోతుగా కనెక్ట్ కావడానికి మాకు అనుమతిస్తుంది.” ఈ క్యాంపెయిన్ వీడియోలో ద్రావిడ్ అన్ని వర్గాల వ్యక్తులను శ్రీరామ్ ఫైనాన్స్ తో భాగస్వామ్యం కావాలని ప్రోత్సహిస్తూ వారి జీవితాలను ఉద్ధరించాలని, వారి ఆశయాలను నెరవేర్చడం కనిపిస్తుంది. చిత్రాలు ఒక శక్తివంతమైన రూపకంతో ముగుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. The technical storage or access that is used exclusively for statistical purposes. Latest sport news.