అమరావతి, డిశంబరు 10: మైనారిటీల బడ్జెట్ ను మైనారిటీల సంక్షేమానికే వినియోగించాలని, ఇతర పథకాల అమలుకై ఆ నిధులను దారి మళ్లించ కూడదని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు శ్రీమతి సయ్యద్ షాహెజాది అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఆమె అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమాన్ని కేంద్ర అమలు పరుస్తున్నదని, ఈ పథకాన్నిరాష్ట్రంలో పటిష్టంగా అమలు పర్చాలని లైన్ డిపార్టుమెంట్ అధికారులను ఆమె ఆదేశించారు. మైనారిటీల ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చేందుకు పెద్ద ఎత్తున ఎంఎస్ఎమ్ఇ లను పెట్టుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. మైనారిటీల్లో బాల కార్మికులు ఎక్కువగా ఉంటారని, అటు వంటి విధానాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలపై పెద్ద ఎత్తున కేసులు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మైనారిటీ యువతులు యుక్తవయస్సులోనే గర్భధారణ ఎక్కువ ఉంటుందనే విషయాన్ని ఆమె తెలుసుకుని, ఇటు వంటివి పునరావృతం కాకుండా వారిలో సరైన అవగాహన కల్పించాలని, అందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను ఆషా, ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు
మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు
జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహెజాది