తెలంగాణ హైకోర్టు టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేమని తీర్పు ఇచ్చింది. డిసెంబర్ 16న రైల్వే పరీక్ష నిర్వహించబడతుండటంతో, ఒకే రోజు గ్రూప్-2 మరియు రైల్వే పరీక్షలు ఉన్నందున పిటిషనర్లు వేరే తేదీకి మార్చాలని కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు విచారణ అనంతరం పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెపుతూ… పిటిషనర్ల అభ్యర్థనను కొట్టివేసింది.
టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలుపుతూ.. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసినట్లయితే లక్షలాది మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని , ఇప్పటికే విద్యార్థులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పరీక్ష వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్లను కొట్టివేసి, గ్రూప్-2 పరీక్షలు యధాతదంగా తేదీకి జరగాలని తీర్పు ఇచ్చింది.