ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో శనివారం నాడు ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వేను నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 2024-25 సంవత్సరానికి గాను నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని తెలిపార రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయి అన్నారు. మెదక్ జిల్లాలోని 21 మండలాల నుంచి 1,91,000 దరఖాస్తులు ఇందిరమ్మ గృహాలకు వచ్చాయని తెలిపారు. జిల్లాలో ఉన్న 469 గ్రామపంచాయతీ లతోపట్లు నాలుగు మున్సిపాలిటీలలో కూడా ఈరోజు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.