vizag drags case

విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ ప్రకటన కలకలం

విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినట్టు ఆరోపణలపై గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ముఖ్యంగా కూటమి నేతలు ఈ వ్యవహారంలో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ..వైసీపీ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు. విశాఖను డ్రగ్ క్యాపిటల్‌గా మార్చేశారంటూ పవన్ కళ్యాణ్, పురందీశ్వరి వంటి నేతలు ఆరోపణలు గుప్పించారు.

అయితే తాజాగా, సీబీఐ ఈ కేసుపై చేసిన ప్రకటనలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. డ్రగ్స్‌ ఉన్నాయన్న అనుమానాలతో పరిశీలించిన కంటైనర్లో ఏ డ్రగ్స్ కూడా లేవని వెల్లడించింది. ఈ ప్రకటనతో కేసు మరింత వివాదాస్పదంగా మారింది. కొన్ని రాజకీయ వర్గాలు గతంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు వట్టి వాదనలుగా మిగిలిపోయాయి.

ఈ ఘటన కూటమి నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలు లేవనేది సీబీఐ ప్రకటనతో తేటతెల్లమైంది. అయితే, ఇదే సమయంలో ప్రతిపక్షం వైసీపీపై మరింత వేధింపులకు దిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పక్షపాతంతోనే ఇలాంటి ఆరోపణలు వచ్చాయా? లేదా నిజంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడారా? అనే విషయంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి.

కేసు మొదట్లో విశాఖపట్నం పోర్టుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే వాదనతో పాటు, దీని వెనుక ఉన్న పెద్ద వ్యక్తుల జాడ తెలుసుకోవాలని పిలుపు వినిపించింది. అయితే ఇప్పుడు సీబీఐ ప్రకటనతో ఆ వాదనల్లో నిజం లేదని తేలడంతో కూటమి నేతలు గందరగోళానికి గురయ్యారని అనిపిస్తోంది. సీబీఐపై కూడా ఒక వర్గం నమ్మకం లేకుండా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

సీబీఐ ప్రకటన తర్వాత కూటమి నేతలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. తమ ఆరోపణల గురించి మరింత వివరణ ఇవ్వడం లేదా స్పందించకపోవడం రాజకీయ దృష్టితో అనుమానాస్పదంగా మారింది. ఈ కేసు అనేక విమర్శలకు, రాజకీయ దూషణలకు దారితీసినప్పటికీ, సీబీఐ ప్రకటన తరువాత రాజకీయ వర్గాల మౌనం ప్రజల్లో కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore the captivating portfolio. Aufbau des uneedpi towers in einer metaverse umgebung, der unternehmen und projekten im pi network als hub dient. The police response, greene said on social media.