The aim is to make AP a kno

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం – సీఎం చంద్రబాబు

విశాఖపట్నం : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్’ సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఎలా అభివృద్ధి చేశామనేది వివరించారు. 1996లో ఐటీ గురించి మాట్లాడిన నేను, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామని అన్నారు. నాడు పైసా ఖర్చు లేకుండా కేవలం భూమి మాత్రమే ఇచ్చి పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మించిన్నట్లు చెప్పారు.


నాడు ఉమ్మడి రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడానికి అమెరికా వెళ్లి ఐటీ పెద్దలను కలిసి భారతీయుల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యం గురించి వివరించిన్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు 20 విద్యా సంస్థలు కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 నుండి 250 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యేలా ప్రోత్సహించామని, నాడు మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆనాడు స్మార్ట్ ఫోన్ల ప్రాధాన్యత గురించి మాట్లాడితే తనను ప్రశ్నించారని అన్నారు. కానీ నేడు మన జీవితంలో టెక్నాలజీ భాగమైంది. ఐటీని ఉపయోగించుకోకపోయి ఉంటే ఆర్థిక వ్యవస్థలో మిగతా దేశాలతో పోటీ పడేవాళ్లం కాదని చెప్పారు.ఒక్కప్పుడు అధిక జనాభా వల్ల నష్టాలు ఉంటాయని భావించామని, కానీ, ఇప్పుడు అదే మన ఆస్తి అని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు జనాభా తక్కువ సమస్య ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు మన భారతీయుడని తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్తూ జనాభా- టెక్నాలజీ రెండూ అవసరమన్నారు. “ఫోర్ పి” నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విశాఖ నగరం భవిష్యత్ నాలెడ్జి హబ్ అంటున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రక్షిత తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీరు అందిస్తున్నామన్నారు.

జీరో బడ్జెట్ నేచురల్ ఫ్రామింగ్ డెవెలప్ మెంట్ నినాదంతో వెళ్తున్నామన్నారు. వెయ్యి కిలోమీటర్లు తీరం ఉందని, సముద్ర రవాణా మీద బాగా దృష్టి పెట్టామని వెల్లడించారు. లాజిస్టిక్ కార్గో కేవలం 14 % ఉందన్నారు. మన రాష్ట్రమే మొదటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందని, పవర్ సెక్టార్ లో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని తెలిపారు. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ కూడా మన రాష్ట్రం నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ డీప్ టెక్ సదస్సులో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్, ఏ ఐ ఫర్ ఎవ్రీ వన్ అనే రెండు పుస్తకాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. “the most rewarding aspect of building a diy generator is seeing the. Latest sport news.