రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం – డిప్యూటీ సీఎం భట్టి

bhatti br

జాతి అభ్యున్నతికి విద్య ప్రాధాన్యతను బీఆర్ అంబేద్కర్ బోధించారని, అందుకే ఆయన అనేక విశ్వవిద్యాలయాలను స్థాపించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ భావజాలం సమసమాజ స్థాపనకు మార్గదర్శకమని ఆయన తెలిపారు. అంబేద్కర్ ఆకాంక్షను ప్రతిపాదిస్తూ యువత మేధస్సు సమాజ అభ్యున్నతికి ఉపయోగపడాలని పేర్కొన్నారు. రాజ్యాంగం సకల సమస్యలకు పరిష్కార మార్గమని, అసమానతల్ని తొలగిస్తే భారత్ ప్రపంచంలో నెంబర్‌వన్ స్థానంలో ఉండేదని ఆయన చెప్పారు. విద్యతోనే అన్ని సమస్యలను అధిగమించవచ్చని అంబేద్కర్ నమ్మకాన్ని గుర్తు చేశారు.

సంవిధాన్ సమ్మాన్ బచావ్ కార్యక్రమం ద్వారా రాజ్యాంగ పరిరక్షణకు ప్రజల చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు. భారత రాజ్యాంగం ఒక్కటే అన్ని సమస్యలకు సమగ్ర పరిష్కారమని, ప్రతి ఒక్కరూ దానిని చదవాలని మల్లు భట్టి సూచించారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని చెప్పుకొచ్చారు.

భారతదేశం మానవ వనరుల పరంగా ఎంతో అభివృద్ధి చెందగల శక్తి కలిగి ఉందని, ప్రపంచాన్ని జయించే మేధస్సు మనలో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, జాతుల మధ్య విభేదాలు, పోరాటాలు ఈ శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని సమతామార్గంలో నడిపేందుకు ప్రజలందరూ ఒక్కటిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Abu obeida, a spokesperson fоr hаmаѕ’ѕ armed wіng, ѕаіd in a ѕреесh оn thе аnnіvеrѕаrу оf thе 7 october аttасk thаt thе. Belgian police shut down a far right conference as it rallies ahead of europe’s june elections. Latest sport news.