మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా

hydhydraa

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. ఆల్వాల్ ప్రాంతంలో ప్రభుత్వం భూమిని ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు అందింది. సిబ్బంది తక్షణం అక్కడ పరిశీలనలు జరిపి, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. వెంటనే బుల్డోజర్‌తో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారు. అక్కడ “ఇది ప్రభుత్వ భూమి” అని బోర్డు ఏర్పాటు చేశారు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో కూడా హైడ్రా అధికారులు చర్యలకు దిగారు. చెరువుల భూములను ఆక్రమించి నిర్మించిన హద్దు గోడలను జేసీబీలతో తొలగించారు. ఖాళీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో ప్రజల నుండి ఫిర్యాదులు అధికంగా రావడం ప్రారంభమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అలాగే హైడ్రా అధికారులు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే తక్షణమే సమాచారం అందించాలని, ఆ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Two dеаthѕ shaped my bеlіеf іn thе rіght tо dіе. Cambodia bans musical horns on vehicles to curb dangerous street dancing. Latest sport news.