అంబేద్కర్‌అభయ హస్తం ఎక్కడ..? కాంగ్రెస్ కు కేటీఆర్ సూటి ప్రశ్న

KTR direct question to Cong

తెలంగాణలో ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరిస్తున్నట్లు పేర్కొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండేట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రభుత్వం BRS పార్టీ నాయకులను కాదు, డాక్టర్ అంబేడ్కర్ ను నిర్బంధించడంతో పాటు, ఆయనకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవడం లేదు” అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంబేడ్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారు. సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. తమమీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి, అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వందల మంది పోలీసులను పెట్టి తమను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. గురుకుల విద్యార్థులను తాము ఎవరెస్ట్‌ శిఖరాలు ఎక్కిస్తే.. మీరు పాడె ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా మీరు అంబేద్కర్‌కు ఇచ్చే నివాళి అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటే సీఎం రేవంత్‌ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతాడని, అయితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టని విమర్శించారు. రాహుల్‌ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటన్నారు. మీ సీఎంకు జ్ఞానోదయం చేయాలంటూ రాహుల్‌ గాంధీకి సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. © 2013 2024 cinemagene.