మెదక్ మాజీ ఎమ్మెల్యే , బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యం. పద్మదేవేందర్ రెడ్డి ని శుక్రవారం ఉదయం పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ధర్నాకు బీఆర్‌ఎస్ (BRS) పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతోపాటు అదుపులోకి తీసుకుంటున్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి గారిని పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు కొంపల్లిలోని వారి నివాసంలో హౌస్ అరెస్టు చేశారు.