డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..ప్రధాన చర్చ వీటిపైనే

telangana assembly session starts on dec 09

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ శాసనసభ, శాసనమండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్తు ఒప్పందాలు, థర్మల్‌ పవర్‌ప్లాంట్లపై కమిషన్ నివేదిక, ఫోన్‌ట్యాపింగ్ వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది.

విజయోత్సవాల సందర్భంగా ఈనెల 7 నుంచి 9 వరకు ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ఆఖరి మూడు రోజుల్లో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించేలా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదుచోట్ల వేదికలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, పీవీ మార్గ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకూ భిన్న రీతుల ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు.

ప్రజల ఆకర్షణ కోసం హస్తకళల ప్రదర్శన, ఫుడ్ స్టాళ్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఐమాక్స్ HMDA గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. 7న వందేమాతరం శ్రీనివాస్‌, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న తమన్ సంగీత విభావరిని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాలు ప్రజలలో ఉత్సాహాన్ని నింపనున్నాయి.

డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశముందని సీఎస్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పనులను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

ఉత్సవాల ముగింపు రోజున డ్రోన్, లేజర్ షో, బాణసంచా ప్రదర్శనలు భారీగా నిర్వహించనున్నారు. ఈ విజయోత్సవాలు ప్రజలకు ప్రభుత్వ విజయాలను చాటి చెప్పే విధంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఆర్థిక మాంద్యం మధ్యా ఈ ఉత్సవాలు ప్రజలలో చైతన్యం నింపుతాయని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To help you to predict better. But іѕ іt juѕt an асt ?. Chinese ambitions for us allies prompts washington security summit with japan, philippines.