టీడీపీలోకి వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని?

unnamed file

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ మాజీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆయన జనసేనలోకి వెళ్తారని వార్తలు వచ్చినా, చివరకు టీడీపీ గూటికే చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నాని గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని ఓడిపోయారు. ఓటమి తర్వాత నాని జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఏలూరు జిల్లా నేతలకు టీడీపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. టీడీపీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నానికి జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటి నాని రాకపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. కానీ.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం నాని చేరికను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని తమను ఇబ్బందులకు గురిచేశారని.. లోకల్ టీడీపీ లీడర్లు చెబుతున్నారు. అయితే వారిని సముదాయించి నాని పార్టీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆళ్ల నానికి వైఎస్‌ఆర్‌సీపీలోని కీలక నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. అందుకే తొలి దశలో ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఎందరో కీలక నేతలు ఉన్నా.. నాని మాటకే జగన్ ప్రాధాన్యత ఇచ్చేవారని అక్కడి ప్రజాప్రతిధులు చెబుతారు. అటు వైఎస్‌ఆర్‌సీపీలో మరో కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా నాని అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. Former shеffіеld unіtеd dеfеndеr george bаldосk dies aged 31 | ap news. Dentist accused of killing wife allegedly wanted fake suicide notes planted – mjm news.