లగచర్ల ఘటన.. నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీల

Lagacharla incident. Accused in police custody for two days

హైదరాబాద్‌: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటునకు వ్యతిరేకంగా అక్కడి గ్రామస్తులు వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరగా.. కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడికి అనుమతించింది.

దీంతో పరిగి పీఎస్‌లో సురేష్‌ను ఈరోజు, బుధవారం పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్‌కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు..చర్చలు ఏమిటన్న దానిపై పోలీసులు సురేష్‌ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసముండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగించారు. దాడిలో గిరిజనులను ఎందుకు రెచ్చగొట్టారు, దానివెనుకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad archives | swiftsportx. Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. Southeast missouri provost tapped to become indiana state’s next president.