సింగరేణి లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – సింగరేణి ఛైర్మెన్

singareni praja palana vija

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని, దీనికోసం అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సింగరేణి ఛైర్మెన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. శనివారం ఆయన ప్రజా విజయోత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదగా 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందివ్వనున్నారని, వీటిలో సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగాలు పొందిన 593 మందికి కూడా నియామక పత్రాలు అందజేయనున్నారని తెలిపారు. ఇందుకోసం తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనికోసం తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక కొత్త పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.

ఏడాది కాలంలో 2,165 కొత్త ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, చరిత్రలో అత్యధికంగా 33% లాభాల వాటా బోనస్ ను కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందని, ఒక్కొక్కరికి రూ.1,90,000 వరకు లాభాల వాటా అందిందని పేర్కొన్నారు. అలాగే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు కూడా 5వేల రూపాయల లాభాల వాటా పంపిణీ చేయడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Two dеаthѕ shaped my bеlіеf іn thе rіght tо dіе. Us military airlifts nonessential staff from embassy in haiti. Latest sport news.