Early arrest of BRS leaders.evil acts. Harish Rao

రేవంత్ మొస‌లి క‌న్నీరు – హరీష్

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదని , స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని ప్ర‌శ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్‌, మోడీ సిద్ధమా? ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా? రైతు రుణమాఫీ చేసిన చ‌రిత్ర త‌మ‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. కాళేశ్వ‌రం క‌ట్టిన అన్న‌డు, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల చేప‌ట్టిన అన్నాడు.

కేవ‌లం సాగునీటి ప్రాజెక్టుల కోసం ల‌క్షా ఎన‌భైమూడు వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాడ‌న్నారు. కాళేశ్వ‌రానికే ల‌క్షా రెండువేల కోట్లు ఖ‌ర్చు చేశార‌న్నారు. అన్ని కోట్లు ఖ‌ర్చు చేసిన ప్రాజెక్టులు కుప్ప‌కూలిపోయి చుక్క‌నీరు లిఫ్ట్ చేయ‌క‌పోయినా కాంగ్రెస్ హ‌యాంలో క‌ట్టిన మంజీర‌, కోయిలసాగ‌ర్, శ్రీరాంసాగ‌ర్, ఎల్లంప‌ల్లిలాంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి ఈ సంవ‌త్స‌రం లేక‌పోయినా 1 కోటి 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రి పండించామ‌ని మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరుగుతున్న రైతు పండగ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.

ఈ మాటలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి మ‌రోసారి మాయమాటలతో రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతులపై ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆవేదనే కనిపించింద‌ని అన్నారు. మహబూబ్ నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యింది. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరు మనిపించింది. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు 15వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చెయ్యి చూపారు.

ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదు. రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేసారు. కేసీఆర్ ప్రారంభించిన రైతుబీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు, మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Easy diy power plan gives a detailed plan for a. Latest sport news.