రామ్ గోపాల్ వర్మపై మ‌రో కేసు

varma

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాకుండా మీడియా, సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇందులో రాజకీయ నాయకులపై చేసే కామెంట్లు, పోస్టులతో పార్టీల కార్యకర్తలతో ప్రశంసలు, విమర్శలు పొందుతూనే ఉంటారు. ఇక టీడీపీ విషయంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్‌లపై ట్వీట్లు, కామెంట్లతో తనదైన శైలిలో ఆర్జీవీ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన వర్మ..ఇప్పుడు కూటమి సర్కార్ లో వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే పలు చోట్లా ఆయనపై కేసులు నమోదు కాగా..ఆయన ను దర్యాప్తు చేసేందుకు పోలీసులు ట్రై చేస్తుంటే..వర్మ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. 2023 జ‌న‌వ‌రి ఎనిమిదో తేదీన ట్విట్టర్ వేదికగా సామాజిక మాధ్యమంలో “కాపు” కులంపై చేసిన వ్యాఖ్యలతో కొత్త వివాదం మొదలైంది. కాపునాడు అంబేడ్క‌ర్ కోనసీమ జిల్లాలోని అమ‌లాపురానికి చెందిన కాపునాడు నాయ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మపై బి.యన్.యస్ 196 సెక్షన్, ఇతర సంభందిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయాలని కోరుతూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్ పిలుపు మేరకు సంయుక్త కార్యదర్శి అబ్బిరెడ్డి శ్రీరామ్మూర్తి, కాపునాడు సంఘ నాయ‌కులు ప‌లువురు అమ‌లాపురం పోలీసుల‌కు పిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. “since, i’ve worn it to cocktail events, and you’d never know it once doubled as a wedding dress ! ”.