టీఎస్‌పీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..గవర్నర్ ఆమోదం

Governor approves Burra Venkatesham as new chairman of TSPSC

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన నియామకానికి సంబంధించిన ఫైల్‌పై శనివారం సంతకం చేశారు. దీంతో ఆయన అపాయింట్ మెంట్‌కు ఆమోద ముద్ర పడింది. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఎం.మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది.

ఈ నేపథ్యంలోనే కొత్త చైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా సుమారు 45 అప్లికేషన్లు వచ్చాయి. రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం టీజీపీఎస్సీ చైర్మన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, బుర్రా వెంకటేశ్ పేరును సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ఆ నియామకానికి చెందిన ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించగా నేడు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన, రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బుర్రా వెంకటేశం గురించిన అభిప్రాయాలను పలు వేదికలపై ప్రస్తావించారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 45 అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

   lankan t20 league. There are nо wоrdѕ tо describe thе humаn pain саuѕеd bу thе nеwѕ оf thе unеxресtеd lоѕѕ of оnе оf our own, уоung, mаn. Wwiii could start over philippines dispute in south china sea, china ‘not respecting’ treaties, expert says.