2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆడాడు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో ఆయన చెన్నై కొత్త ఫాస్ట్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్‌పై వరుస ఫోర్లు, సిక్సర్లు బాదడం గమనార్హం.బరోడా మరియు తమిళనాడు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో, ఇరు జట్లూ 200కు పైగా పరుగులు సాధించడంతో మ్యాచ్ చివరి బంతి వరకు ఆసక్తిని కొనసాగించింది.బరోడా జట్టు టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. బరోడా జట్టు 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మైదానంలో దిగింది.
పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు చేసి బరోడా విజయంలో కీలక పాత్ర పోషించాడు.17వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా చెన్నై బౌలర్ గుర్జప్నీత్ సింగ్‌ను బాగా ఎదుర్కొన్నాడు. ఈ ఓవర్‌లో పాండ్యా వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.
అనంతరం గుర్జప్నీత్ సింగ్ నో బాల్ వేసాడు, ఆ తర్వాత పాండ్యా నాల్గవ బంతికి సిక్స్, ఐదవ బంతికి ఫోర్ బాదాడు.చివర్లో ఓవర్ చివరి బంతికి 1 పరుగు వచ్చింది. మొత్తంగా గుర్జప్నీత్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో పాండ్యా 29 పరుగులు చేశాడు, నో బాల్‌తో ఆ పరుగు కూడా లెక్కించుకుంటే 30 పరుగులు అయ్యాయి. పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్‌తో బరోడా జట్టుకు విజయం అందించాడు, ఈ మ్యాచ్ ఒక శక్తివంతమైన ఫినిష్‌తో ముగిసింది.