ట్రంప్ చైనా, మెక్సికో, కెనడా నుండి వస్తున్న వస్తువులపై అదనపు టారిఫ్స్ విధించాలని ప్రకటించారు. ఆయన సోమవారం తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. చైనా, ఫెంటానిల్ రవాణా చేసే అక్రమ గుంపులపై మరణశిక్ష విధించే హామీ ఇచ్చినా, వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. “మునుపు ఎప్పుడూ కనిపించని స్థాయిలో, మెక్సికో ద్వారా డ్రగ్స్ మా దేశంలో ప్రవహిస్తున్నాయి” అని ట్రంప్ తెలిపారు.
“చైనాకు 10% అదనపు టారిఫ్‌ను విధిస్తాం, ఇది ఇప్పటికే ఉన్న టారిఫ్‌లకు మించి ఉంటుంది. అలాగే, మెక్సికో మరియు కెనడా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25% టారిఫ్‌ను విధించనున్నాం,” అని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా చైనా నుండి డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ట్రంప్ ఒక నైతిక ఒత్తిడి సృష్టించాలనుకున్నారు.
ఈ టారిఫ్ డ్రగ్స్,ముఖ్యంగా ఫెంటానైల్ మరియు అక్రమ వలసదారులు మా దేశంలో ప్రవేశించడం ఆపేవరకు కొనసాగుతుంది. అని ట్రంప్ చెప్పారు.ఆయనను అనుసరించే వారి దృష్టిలో,ఇది అమెరికాలో అక్రమ డ్రగ్స్ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఒక ప్రభావవంతమైన చర్యగా కనిపిస్తోంది.