అంజీర పండుతో చర్మానికి సహజ నిగారింపు..

anjeer

అంజీర పండు ఆరోగ్యానికి మాత్రమే కాక, చర్మానికి కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీ ముఖాన్ని అంజీర పండుతో ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. అంజీరలో పుష్కలంగా ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు సహజ మిశ్రమాలు చర్మానికి అద్భుతమైన లాభాలు అందిస్తాయి. ఈ పండులోని పోషకాలు ఉత్పన్నమైన ఫ్రీ రాడికల్స్‌ ను పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.అంజీరలో ఉన్న పెనోల్స్‌ వంటి సహజ పదార్థాలు సూర్యరశ్మి వల్ల ఏర్పడే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఎక్కువ సమయం సూర్యకిరణాలకు గురైన చర్మం పెగ్మెంటేషన్, మచ్చలతో బాధపడుతుంటుంది.

ఇది ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తుంది.చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి అంజీరని ఇలా ఉపయోగించవచ్చు: రెండు అంజీర పండ్లను మెత్తగా ముద్దగా చేసుకోవాలి. తర్వాత దానికి రెండు చెంచాల పాలు మరియు చెంచా తేనెను కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి వేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత నీటితో కడిగితే ముఖం ప్రకాశవంతంగా, నిగారింపుతో కనిపిస్తుంది.

అంజీరను నేరుగా తినడం కూడా చర్మాన్ని పోషించడానికి దోహదపడుతుంది.రోజు అంజీర తినడం వల్ల చర్మం మరింత హైడ్రేటెడ్‌గా ఉండి, సహజ రక్షణ పొర ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యకరంగా మార్చుకోగలుగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

There are nо wоrdѕ tо describe thе humаn pain саuѕеd bу thе nеwѕ оf thе unеxресtеd lоѕѕ of оnе оf our own, уоung, mаn. The technical storage or access that is used exclusively for anonymous statistical purposes. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its.