రీసెర్చ్, లెర్నింగ్, నాలెడ్జకు మన దేశాన్ని కేంద్రంగా మార్చే లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్'(ONOS)కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రధాని మోదీ తెలిపారు. విద్యావ్యవస్థ, యువత సాధికారతకు ఇదొక గేమ్ ఛేంజర్ అని ట్వీట్ చేశారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థలకు వేలాది అంతర్జాతీయ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి.
ఇది 1.8 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా విద్యా, పరిశోధన రంగాలను మద్దతు ఇవ్వడానికి, అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడింది. ఈ పథకం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు దేశీయంగా ఉన్న శాస్త్రీయ పత్రాలు, జాతీయ-అంతర్జాతీయ జర్నల్స్‌కి ఒకే సబ్‌స్క్రిప్షన్ ద్వారా యాక్సెస్ పొందగలరు. అలాగే పబ్లిక్ ఫండ్స్ ఉపయోగించి సబ్సిడీ ద్వారా సమాచార వనరులు అందుబాటులోకి రాబడతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు డిజిటల్ యాక్సెస్‌ను పెంచడం దీని లక్ష్యం. అలాగే కాబినెట్ లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని లక్ష్యం విద్యా సంస్థలలో ఇన్నోవేషన్ కల్చర్‌ను ప్రోత్సహించడం, యువతలో ఆవిష్కరణా సామర్థ్యాలను పెంచడం.