హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సిఎఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతలను కలువనున్నారు. అలాగే.. మహారాష్ట్ర, జార్ఙండ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతల సమావేశం ఉన్నట్లు సమాచారం. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలన విజయగాథలపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
ఇక, ఇప్పటికే 26 సార్లు ఢిల్లీకి వెళ్లాడని బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా… టార్గెట్ కేటీఆర్.. కుట్రకు తెరలేపిందని రేవంత్ సర్కార్ పై బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో కేటీఆర్ పై గురి పెడుతోందని అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే ఆరు కేసులు నమోదు చేసినట్లు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ అరెస్టే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలతో వరుస ఫిర్యాదులు కూడా కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి అమిత్ షాపై చార్మినార్ కేసు కొట్టివేశారని….కేటీఆర్ పై మాత్రం ఉందని ఆరోపణలు చేస్తున్నారు.
ఇందులో నామినేటెడ్ పోస్టుల భర్తీ, కుల గణన వంటి అంశాలతో పాటు, మంత్రివర్గ విస్తరణపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలు నెల క్రితమే తీసుకోవాల్సి ఉండగా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసభ్యులు నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని సమాచారం.