పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది.ఇందులో ఉండే విటమిన్లు మరియు మినరల్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పెరుగు మధుమేహం నియంత్రణలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ఈ పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
అంతేకాదు, పెరుగులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక, పెరుగులో ఉన్న ప్రొటీన్ కూడా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది.అలాగే, పెరుగులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, చర్మ సమస్యలను తగ్గించి, స్వచ్చమైన మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందడంలో సహాయపడతాయి.
రాత్రి సమయంలో పెరుగు తినడం వలన కొంతమంది కడుపు సమస్యలతో బాధపడతారు. ఎందుకంటే రాత్రిపూట జీర్ణం కొంచెం కష్టంగా జరుగుతుంది మరియు పెరుగు పేచీలు మరియు అజీర్తి వంటి సమస్యలను కలిగించవచ్చు. దానితో పాటు, పెరుగులో ఉన్న కొవ్వు శరీరంలో రాత్రి సమయంలో సులభంగా కొవ్వుగా మారుతుంది. దీని వల్ల కొంతమంది బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
పెరుగు శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.అయితే, ఈ ప్రయోజనాలు మరియు సమస్యలను గమనించి పరిమితంగా పెరుగు తీసుకోవడం మంచిది.